శ్రీ రామరాజ భూషణ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్.
`` బీద విద్యార్ధుల సహాయ నిధికి విరాళాలు ఇవ్వండి.
భట్టరాజ జాతి మహోన్నతికి తోడ్పడండి ''
కీర్తి శేషులు శ్రీ దింటకుర్తి పుల్లం రాజు గారు భట్రాజు కులంలోని పిల్లలు ప్రతిభ
కలిగి వున్నప్పటికి ఆర్ధికంగా వెసులుబాటు లేక పలు రకాల పనులు చేసుకొనటం చూసి , బాధపడి ``రాజుల సేవా సమితీ'' అను సేవా సంస్థను స్థాపించి భట్రాజు కులం లోని విద్యార్థులు చదువుకొనటానికి తనవంతు కృషి చేశారు.
భట్రాజు కులం లోని చిన్నారులు ప్రతిభ కలిగి వున్నప్పటికి చదువు కొనసాగించలేకపోతున్నారని , వారికి మరింతగా సహాయ సహకారాలు అందించాలనే వుద్దేశ్యంతో ` రాజుల సేవా సమితి ' ని `` శ్రీ రామరాజ భూషణ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ '' అనే పేరుతో ది. 24-01-2008 న రిజిస్టరు చేయించడం జరిగింది.[ రిజిస్టర్ నెం. 18/బి.కె.4/2008 ] .
ఈ ట్రస్ట్ వున్నతికై శ్రీ గవర్రాజు వెంకటరామ రాజు గారు , శ్రీ బిరుదురాజు వెంకటేశ్వర రాజు గారు , శ్రీ బిరుదురాజు వెంకట అప్పల రాజు గారు , శ్రీ తోకచిచ్చు గంగ రాజు గారు , శ్రీ రాళ్ళబండి బ్రహ్మ రాజు గారు , శ్రీ కూరపాటి కోటం రాజు రాజు గారు , మొదలైనవారు ఎంతో క్రుషి చేశారు.
ప్రస్తుతం ఈ క్రింది కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది.
శ్రీ కూరపాటి కోటం రాజు గారు -- ఛైర్మన్.
శ్రీ నండూరు ఆదినారాయణ రాజు గారు -- వైస్ ఛైర్మన్.
శ్రీ సరికొండ సతీష్ గారు -- సెక్రటరీ.
శ్రీ రాళ్ళబండి బ్రహ్మ రాజు గారు -- జాయంట్ సెక్రటరీ.
శ్రీ ప్రతిగుడుపు జయప్రకాశ రాజు గారు -- ట్రెజరర్.
ఈ ట్రస్ట్ కు ప్రముఖ కవి శ్రీ రామరాజ భూషణు ని పేరు పెట్టడం జరిగింది. వీరు రచించిన వసు చరిత్రము ఆంధ్ర వాఙ్మయమున నొక యపూర్వ కవితా సృష్టి అని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.
ఈ ట్రస్ట్ మన భట్టరాజులలో - [1] తెలివైనవారిని, చదువు పట్ల ఆసక్తి వుండి పేదరికం కారణంగా చదువుకోలేక పోతున్న విద్యార్థులకు సహాయపడుటకొరకు, [2] మెరుగైన నైపుణ్యం కలిగి తగిన అవకాశాల కోసం ఎదురు చూస్తున్న మన యువతకు సరైన అవకాశాలు లభించేలా కృషి చేయుటకు , [3] ఇప్పటికే సమాజంలో పేరు ప్రఖ్యాతులు గడించిన మన కులస్థులను సత్కరించి , వారి అనుభవాలను అభివృద్ధి చెందుతున్న భట్టరాజీయులకు అందించుటకు వేదికగా నుండుటకు, [4] విద్యా, సామాజిక కార్యక్రమాల ద్వారా భట్టరాజ కులస్థుల సేవలను సమాజానికి అందించి సమాజసేవలో మరింత చురుకుగా పాల్గొనుట ముఖ్య వుద్దేశ్యముగా ఏర్పాటైనది.
గత 29 సంవత్సరాలుగా ట్రస్ట్ నిర్వహించుచున్న ఈ స్కాలర్షిప్పుల పంపిణీ కార్యక్రమానికి
16,10,000/- రూపాయలను మూలధనంగా అందించి ఎంతోమంది వదాన్యులు సహాయపడ్డారు. ఈ ట్రస్ట్ వారందరకూ కృతజ్ఞత తెలుపుకుంటున్నది. ఈ ధనమంతయూ బ్యాంకులలో ఫిక్సెడ్ డిపాజిట్ గా వుంచడమైనది.
ఈ ట్రస్ట్ మూలధనం లో నుండి వచ్చిన వడ్డీతో మాత్రమే క్రిష్ణా , గుంటూరు , ప్రకాశం జిల్లాల విద్యార్థులకు వుపయోగపడే విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలని , రు. 25,000/- విరాళంగా ఇచ్చిన వారి పేరుతో దాని నుండి వచ్చిన వడ్డీతో ప్రతి సంవత్సరం ఒక విద్యార్థికి పారితోషికం ఇచ్చుటకు ట్రస్ట్ కార్యవర్గం తీర్మానించింది.దీనికి స్పందించి అనేకమంది దాతలు విరాళాలు అందించి తమ దాతృత్వాన్ని తెలియజేశారు.
ఈ మూలధనం నుండి రాబడిన వడ్డీ మరియు దాతలనుండి సేకరించిన ధనంతో విద్యార్థులకు పారితోషికం ముఖ్య అతిథులచే అందజేయబడుతున్నది. ఇప్పటివరకు ట్రస్ట్ పంపిణీ చేసిన పారితోషికం ఈ దిగువన వుదహరించుచున్నాము.
2013 సంవత్సరము నుండి క్రిష్ణా జిల్లాలోని 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులకు కూడా రూ. 1,000/- చొప్పున ఆర్ధిక సహాయము అందజేయడం జరుగుతున్నది.
2018 సంవత్సరము నుండి 10 వ తరగతి మరియు సీనియర్ ఇంటర్ పబ్లిక్ పరీక్షలలో 10 జి.పి.యె. వచ్చిన విద్యార్థులకు రు. 2,500/- ఇవ్వడం జరుగుతున్నది .
YEAR STUDENTS AMOUNT [ Rs. for each] TOTAL AMOUNT
1984 to 94 198 Rs.300/- Rs. 59,400/-
1995 22 300/- 6,600/-
1996 6 500/- 3,000/-
1997 6 500/- 3,000/-
1998 6 500/- 3,000/-
1999 12 500/- 6,000/-
2000 12 500/- 6,000/-
2001 12 500/- 6,000/
2002 3 500/- 1,500/-
2005 11 500/- 5,500/-
2006 10 1,000/- 10,000/-
2007 17 1,000/- 17,000/-
2008 39 1,000/- 39,000/- + 5,000/-
2009 44 1,500/- 66,000/- + 2,500/-
2010 44 1,500/- 66,000/- + 2,500/-
2011 49 2,000/- 98,000/-
2012 32 2,000/- 64,000/-
2013 40 2,000/- 80,000/-
6 1,000/- [ Lower classes] 6,000/-
2014 51 2,000/- 1,02,000/-
18 1,500/- [ Lower Classes ] 27,000/-
2015 60 2,000/- 1,20,000/-
6 5,000/- 30,000/-
30 1,500/- [Lower Classes ] 45,000/-
2016 76 2,000/- 1,52,000/-
51 1,500/- [Lower Classes ] 76,500/-
2017 40 1,500/- [ Lower Classes ] 60,000/-
58 2,000/- 1.16,000/-
2018 30 1,500/- [ Lower Classes ] 45,000/-
45 2,000/- 90,000/-
12 2,500/- [ 10 GPA Rankers ] 30,000/-
2019 29 1,500/- ] Lower Classes ] 43,500/-
45 2,000/- 90,000/-
11 2,500/- ] 10 GPA Rankers ] 27,500/-
2020 16 2,000/- 32,000/-
---------------
Grand Total Rs. 16,42,500/-
-----------------------
1984 నుండి 2007 వరకు 10 వ తరగతి లో అత్యథిక మార్కులు వచ్చిన వారికి ఒక్కక్కరికి రూ. 1,116/- లు బహుకరించడమైనది.
2008 సంవత్సరంలో 34 మంది విద్యార్థులకు ఇంగ్లీషు డిక్షనరీలు ట్రస్ట్ చే బహుకరించబడినవి.
2008 , 2009 , 2010 , 2011 సంవత్సరాలలో 10 వ తరగతి లో అత్యధిక మార్కులు వచ్చిన ఐదుగురు విద్యార్థులకు గౌరవనీయ , విద్యాబంధు శ్రీ కూరపాటి భూపతి రాజు గారు [ శ్రీ శ్రీ రియల్ ఎస్టేట్ ,హైదరాబాద్ ]ఒక్కక్కరికి గోల్డ్ మెడలు మరియు రూ. 2,000/- బహుకరించియున్నారు.
అలానే ప్రతి సంవత్సరం కూడా యిస్తానని చెప్పారు.
ది. 26-10-2008 న శ్రీ రామరాజ భూషణ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ [1984-2008] స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకొన్నది.
భవిష్యత్తులో ఈ కార్యక్రమమును అన్ని జిల్లాలకు విస్తరింపజేయాలని , అందుకు జిల్లాలలోని వదాన్యుల సహకారం ఎంతైనా అవసరమని తెలియజేస్తున్నాము. ఈ బృహత్కార్యానికి మీయొక్క చేయూతనందించవలసిందిగా కోరుచున్నాము.
Our Bank : -- State Bank Of India , U.G.Hospital Branch , Vijayawada
A/C. No. 62167524900
IFSC . SBIN 0021050
CIF No. 72071030232.
చిరునామా:-
శ్రీ రామరాజ భూషణ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ,
కేర్ : శ్రీ సత్య శాయి పబ్లిక్ స్కూల్ ,
ఆఫీస్ :డోర్ నెం : 74-14-41 ,
అయ్యప్ప నగర్ ,
విజయవాడ - 520007.
ఫోన్ నెం. : 0866-2552565.
సెల్: 99498 93883.
---------------
Grand Total Rs. 16,42,500/-
-----------------------
1984 నుండి 2007 వరకు 10 వ తరగతి లో అత్యథిక మార్కులు వచ్చిన వారికి ఒక్కక్కరికి రూ. 1,116/- లు బహుకరించడమైనది.
2008 సంవత్సరంలో 34 మంది విద్యార్థులకు ఇంగ్లీషు డిక్షనరీలు ట్రస్ట్ చే బహుకరించబడినవి.
2008 , 2009 , 2010 , 2011 సంవత్సరాలలో 10 వ తరగతి లో అత్యధిక మార్కులు వచ్చిన ఐదుగురు విద్యార్థులకు గౌరవనీయ , విద్యాబంధు శ్రీ కూరపాటి భూపతి రాజు గారు [ శ్రీ శ్రీ రియల్ ఎస్టేట్ ,హైదరాబాద్ ]ఒక్కక్కరికి గోల్డ్ మెడలు మరియు రూ. 2,000/- బహుకరించియున్నారు.
అలానే ప్రతి సంవత్సరం కూడా యిస్తానని చెప్పారు.
ది. 26-10-2008 న శ్రీ రామరాజ భూషణ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ [1984-2008] స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకొన్నది.
భవిష్యత్తులో ఈ కార్యక్రమమును అన్ని జిల్లాలకు విస్తరింపజేయాలని , అందుకు జిల్లాలలోని వదాన్యుల సహకారం ఎంతైనా అవసరమని తెలియజేస్తున్నాము. ఈ బృహత్కార్యానికి మీయొక్క చేయూతనందించవలసిందిగా కోరుచున్నాము.
Our Bank : -- State Bank Of India , U.G.Hospital Branch , Vijayawada
A/C. No. 62167524900
IFSC . SBIN 0021050
CIF No. 72071030232.
చిరునామా:-
శ్రీ రామరాజ భూషణ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ,
కేర్ : శ్రీ సత్య శాయి పబ్లిక్ స్కూల్ ,
ఆఫీస్ :డోర్ నెం : 74-14-41 ,
అయ్యప్ప నగర్ ,
విజయవాడ - 520007.
ఫోన్ నెం. : 0866-2552565.
సెల్: 99498 93883.